ట్విట్టర్ లో 7 మిలియన్లకి చేరిన ఐకాన్ స్టార్ ఫాలోవర్స్ ఆనందంలో అభిమానులు!

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. అల్లు అర్జున్ తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకోవడమే కాకుండా తన డాన్స్ తో కూడా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. అల్లు అర్జున్ డాన్స్ అంటేనే కొత్త తరహాలో ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఎప్పుడు స్టైలిష్ లుక్ తో కనిపించే అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ మార్కెట్ పెరగటమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఈ క్రమంలో ట్విట్టర్ లో అల్లు అర్జున్ 7 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇటీవల అల్లు అర్జున్ షేర్ చేసిన ఆల్ట్రా మోడ్రన్ లుక్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. అయితే ట్విట్టర్ లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్ల కు చేరుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 నటించటానికి సిద్దంగా ఉన్నాడు. తొందర్లోనే ఈ షూటింగ్ పట్టాలెక్కనుంది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్ ప్రమోషన్ యాడ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమ ప్రాడక్ట్స్ కి అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ చేయటానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ సినిమాలు, యాడ్స్ తో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డీ కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో రచ్చ చేస్తోంది. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందంతో ఫోటోలకు ఫోజులిస్తు ఫాలోయర్స్ ని పెంచుకుంటుంది.