అబ్బే, కష్టం బాసూ.!

మాస్ మహరాజ్ రవితేజ నుంచి ‘రావణాసుర’ టీజర్ వచ్చింది. వచ్చే నెలలో సినిమా రిలీజ్. ఇదొక థ్రిల్లర్ మూవీ అని టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. సినిమాలో బోల్డంతమంది హీరోయిన్లున్నారు. లిస్టు రాసుకుంటూ పోతే, అనూ ఇమ్మాన్యుయేల్ నుంచి దక్ష నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మెఘా ఆకాష్, పూజిత పొన్నాడ.. ఇదండీ సంగతి.

హీరోయిన్ల సంగతి పక్కన పెడితే, సినిమాలో సీరియల్ కిల్లర్‌లా రవితేజ కనిపిస్తాడని టీజర్‌తో ఓ ప్రింట్ వేసేశారు ఆడియన్స్ మైండ్‌లో చిత్ర దర్శక నిర్మాతలు. అది కాస్తా, సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్‌కి కారణమవుతోంది.

రవితేజ విలనిజాన్ని ఈ సినిమాలో చూడాలా.? అబ్బే, జనాన్ని చంపేసినా.. మంచోడే సుమీ.. అని చివర్లో జడ్జిమెంట్ ఇస్తారా.? అనే డౌటానుమానాలు వస్తున్నాయ్. ‘ధమాకా’ లాంటి సరదా సినిమాలు చేసుకోక, రవితేజకి ఇలాంటివెందుకు.? అన్న చర్చ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అబ్బే, కష్టం బాసూ.. అని రవితేజని ఉద్దేశించి సినీ అభిమానులు తేల్చేస్తుండడం శోచనీయమే సుమీ.