ఒక్కసారి జరిగితే పొరపాటు.. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతోందంటే, దానర్థమేంటి.? నిర్లక్ష్యం అనుకోవాలా.? అంతేనేమో.! ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ గుర్తుంది కదా.? చాలా చాలా దారుణంగా ట్రోలింగ్‌కి గురయ్యింది అది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా. నానా రకాల వివాదాల నడుమ ‘ఆదిపురుష్’ హంబక్ అయిపోయింది.
500 కోట్లు వచ్చేశాయంటూ ప్రచారం చేసుకున్నారుగానీ, అదొక డిజాస్టర్ సినిమా. నిర్లక్ష్యం.. మామూలు నిర్లక్ష్యం కాదు. ప్రభాస్ మీద ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారంతే. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కె’ విషయంలోనే అదే జరుగుతోంది.
ఫస్ట్ లుక్ వదిలారు, తనకాయ కూడా సరిగ్గా అతికించడం చేతకాలేదన్న విమర్శలు వస్తున్నాయ్. అయినా, ప్రభాస్ ఏం చేస్తున్నట్లు.? తన ఇమేజ్ డామేజ్ అవుతున్నా చూసీ చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నాడు.?
బద్ధకం ఎక్కువైపోయింది.. నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది.. అని ప్రభాస్ మీదా అభిమానులు గుస్సా అవుతున్నారు. ఇదిలా వుంటే, ఈసారి ప్రభాస్ చాలా సీరియస్ అయ్యాడు నిర్మాణ సంస్థ మీద.. అని అంటున్నారు. నిజమేనా.? నమ్మొచ్చా.?