RRR: ఆర్ ఆర్ ఆర్ సినిమా రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో చరణ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. కొన్ని సన్నివేశాల్లో తారక్ తన నటనతో అభిమానులను ఫిదా చేశారు. సినిమాను చూసిన సెలబ్రిటీలు హీరో హీరోయిన్లు దర్శకులు మొదలైన వారందరూ సినిమాను తీసిన విధానాన్ని,ఎన్టీఆర్ చరణ్ ల నటన డాన్స్ లను చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
విడుదలైన రోజు నుంచి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఏ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా నటన పరంగా ఇద్దరు అద్భుతంగా నటించారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరికీ నేషనల్ అవార్డ్ పక్క అని చెబుతున్నారు. అయితే నేషనల్ అవార్డు ఎవరికి వస్తుంది అన్న దాని గురించి అభిమానులు మాట్లాడుతూ, ఇద్దరిలో అవార్డు ఎవరికి వచ్చినా తమకు సంతోషమేనని అభిమానులు చెబుతున్నారు.
మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. చరణ్, ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ వచ్చేనెలలో ఆచార్య మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎన్టీఆర్, చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులు భారీ బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కనున్నాయి. అయితే ఇద్దరు హీరోలు తదుపరి చిత్రాని కొరటాల శివ దర్శకత్వం లోనే చేస్తుండడం విశేషం