ఫ్యాన్స్‌ని కాస్త కూల్ చెయ్యవయ్యా ప్రబాసూ.!

ఈ సారైనా ప్రబాస్ ఏం చేస్తాడో.! ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రబాస్ సినిమాలపై వుత్త హైప్ తప్ప.. ఒక్క సినిమా కూడా హిట్టయ్యింది లేదు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నా.. ఆ తర్వాత వరుస పెట్టి ప్రబాస్ నుంచి సినిమాలు వస్తూనే వున్నాయ్.

కానీ, ఒక్కటీ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచడం లేదు. ఇటీవల వచ్చిన ‘ఆది పురుష్’ చిత్రం మరీ దారుణం. ఎక్కడ లేని నెగిటివిటీ మూట కట్టుకున్నాడు ఈ సినిమాతో ప్రబాస్. కానీ, ఆ నెగిటివిటీ అంతా ‘సలార్’తో పొగొట్టేస్తాడంటూ మళ్లీ చిన్న ఆశ ఫ్యాన్స్‌లో.

ఏం చేస్తాడో ఏమో తెలీదు కానీ, ఈ సినిమా ఆలస్యమే పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ రావడం లేదు. పోనీ.! ఫ్యాన్స్‌ని హుషారెత్తించేలా ఏదో ఒక అప్డేట్ అయినా వదులుతారా.? అంటే అదీ చేయడం లేదు.

ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ఏం చేస్తున్నారంటూ కొందరు ప్రబాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరయితే బరస్ట్ అయిపోతున్నారు. ప్రబాస్ అయినా ఈ విషయం కాస్త గమనిస్తే మంచిదంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

ఏది ఏమైనా ‘సలార్’ డిశంబర్‌లో పక్కాగా వస్తుందంటూ తాజా ఖబర్. సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందని గంపెండు ఆశలు పెట్టుకున్నారు. కుదరలేదు. ఇప్పుడు డిశంబర్ అంటున్నారు. సంక్రాంతి అన్న ప్రచారం కూడా లేకపోలేదు. చూడాలి మరి, ప్రబాస్ ఫ్యాన్స్‌కి ఇంకెంత కాలమో ఈ ఎదురు చూపులు.!