Surekha vani: సురేఖ వాణి పేరుతో నకిలీ ఫోన్ నెంబర్.. ఫ్యాన్స్ ను అప్రమత్తం చేసిన నటి..!

Surekha vani: సురేఖ వాణి తెలుగు సినిమాల్లో అక్క గా,వదినగా, తల్లిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. భర్త తేజ మరణించక సురేఖ వాణి ఆ బాధనుండి కోలుకుని సోషల్ మీడియా లో అడుగుపెట్టింది. సురేఖ వాణి హోమ్ లుక్ నుండి గ్లామర్ గా కనిపించడం మొదలెట్టింది. సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ రీల్స్ లో తను కూతురు సుప్రీతతో పాటు డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఎంత మంది వారిపై నెగెటివ్ కామెంట్ లు పెట్టినా, ట్రోల్ చేస్తున్నా అవేవి పట్టించుకోకుండా వారి జీవితం వారిది అన్నట్టు ఎంజాయ్ చేస్తోంది సురేఖ.

ఇక తన కూతురు సుప్రీత కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోందట సురేఖ. ఈ మధ్యనే సుప్రీత ఒక ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత సుప్రీత ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తల్లి రెండో పెళ్లి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు. రెండో పెళ్లి అనేది పూర్తి గా తన వ్యక్తిగత విషయమని, నా వరకు అమ్మకు రెండో పెళ్లి చేయాలనుందని చెప్పింది. తన కెరీర్ కన్నా నా కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోందని చెప్పింది.

అయితే ఇటీవల ఫేస్ బుక్, ట్వీటర్ లో సురేఖ వాణి నెంబర్ అంటూ ఒక నెంబర్ వైరల్ అయింది. ఈ విషయం సురేఖ దృష్టికి వెళ్లగా అది తన నెంబర్ కాదని తనకు పేస్ బుక్, ట్విట్టర్ లో తనకు ఖాతాలు లేవని ఆ నెంబర్ తనది కాదని తన అభిమానులను అప్రమత్తం చేసింది. ఎవరు ఆ నెంబర్ నుoడి వచ్చిన సందేశాలకు స్పందించవద్దని వ్యక్తిగత వివరాలు, డబ్బులు బదిలీ చేయడం చేయకండని ఇంస్టాగ్రామ్ లో ప్రకటించింది.