బాక్సాఫీస్ : మళ్ళీ మ్యాజిక్ మార్క్ అందుకున్న “ఎఫ్ 3” సినిమా వసూళ్లు.!

f3 movie

ఈ ఏడాదికి మన టాలీవుడ్ నుంచి ఈ గాడిన 5 నెలల్లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టాయో చూసాము. కొన్ని సినిమాలు మినహా మిగతా మన స్టార్ హీరోల అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకున్నాయి. అయితే ఈ అన్ని సినిమాల్లో కూడా దాదాపు మల్టీ స్టారర్ సినిమాలే హిట్స్ గా నిలిచాయి.

 

అలా లేటెస్ట్ గా వచ్చిన మరో ఫన్ ఫుల్ మల్టీ స్టారర్ “ఎఫ్ 3” కూడా సాలిడ్ వసూళ్లతో అదరగొడుతుంది. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి తీసిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఫామిలీ ఆడియెన్స్ ని లాగేసుకున్న ఈ చిత్రం ఇప్పటికి సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుంది.

 

అయితే గతంలో ఇదే కాంబోలో వచ్చిన ఎఫ్ 2 సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర ఎలా అయితే వండర్స్ సెట్ చేసి నార్మల్ రేట్స్ తోనే 100 కోట్ల గ్రాస్ లోకి చేరగా ఇప్పుడు ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంది. కేవలం 9 రోజుల్లోనే ఈ చిత్రం 102 కోట్ల గ్రాస్ ని అందుకుని అదరగొట్టింది.

మొత్తానికి అయితే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో తమన్నాపై, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించగా పూజా హెగ్డే మరియు సోనాల్ చౌహన్ లు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో కనిపించారు. అలాగే దిల్ రాజు నిర్మాణం అందించాడు.