సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న F3..రన్ టైం ఎంతంటే?

వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన కామెడీ ఎంటర్టైనర్ F2 . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా నిర్మించిన F3 సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా తమన్నా నటించగా.. వరుణ్ తేజ్ కి జోడీగా మెహ్రీన్ పిర్జాదా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, మ్యూజిక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమ విడుదల కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులను అలారించటానికి ఈ నెల 27 వ తేదిన భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా యూనిట్ బుల్లితెర మీద కూడా సందడి చేశారు. ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో లో సందడి చేసిన F3 టీమ్, తాజగా జీ టీవీ లో సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ పనులూ అన్ని పూర్తీ అయినట్టు సమాచారం. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమాకి క్లీన్ యూ (U) సర్టిఫికేట్ వచ్చినట్టు ఫిల్మ్ మేకర్స్ తెలిపారు. అయితే ఈ ప్రేక్షకులు దాదాపు రెండున్నర గంటల సమయం సినిమా చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఈ సినిమ చూసిన సెన్సార్ టీమ్ వాళ్ళు కూడా సినిమా గురించి పాజిటివ్ గా చెప్పటంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారు.