F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.. మరో F అంటే ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ మల్టీస్టారర్ హిట్స్ గా నిలిచిన సినిమాలో F2 ఒకటి. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న ఆ సినిమాలో వరుణ్ తేజ్ , వెంకటేష్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అయితే సినిమా ఫ్రాంచైజ్ గా కంటిన్యూ అవుతూ దర్శకుడు F3 కథను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి అనిల్ మరో Fకు ఎలాంటి అర్దాన్ని చెప్పనున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.


F2లో భార్య, భర్తలకు సంబంధించిన కామెడి ఎపిసోడ్స్ ను హైలెట్ చేసిన అనిల్ ఈ సారి ఫ్యామిలీ లైఫ్ ను మొత్తం చాలా క్లోజ్ గా చూపించనున్నాడట. రెగ్యులర్ గా రొటీన్ కుటుంబాల తీరును కామెడీ యాంగిల్ లో ప్రజెంట్ చేయనున్నాడట. ఇక మరో F అంటే ఫ్యామిలీ అని క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా ఆ సినిమా కూడా ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించగలదని దర్శకుడు ముందు నుంచి చెబుతున్నాడు. ఇక మరో హీరో కూడా చిత్ర యూనిట్ తో కలిసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి నిర్మాత దిల్ రాజు ఈ సారి ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

దర్శకుడు అనిల్ రావిపూడి మొదట మరో స్టార్ హీరోతో సినిమా చేసి అనంతరం F3 ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకున్నాడు. కానీ అగ్ర హీరోలు ఖాళీగా లేకపోవడంతో మీడియం హీరోలతోనే F3 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. హీరోయిన్స్ విషయంలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక మూడో హీరో ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ నుంచి రూమర్స్ వస్తున్నా దర్శకుడు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కథ అయితే పూర్తయ్యింది. ఇక త్వరలోనే మరో స్పెషల్ అప్డేట్ తో సినిమాను స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.