‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నుంచి ఒలే ఒలే పాపాయి.. వచ్చేసింది!

టాలీవుడ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా.. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌.. ట్రైలర్‌లు అభిమానులను ఇంప్రెస్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ మాస్‌ సాంగ్‌ వదిలారు.

ఈ మూవీ నుంచి ‘ఒలే ఒలే పాపాయి’ అంటూ సాగే మాస్‌ ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటను రామ్‌ మిర్యాల, ప్రియ ఆలపించగా.. హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందించాడు. జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటకు సంబంధించి ఫుల్‌ సాంగ్‌ను డిసెంబర్‌ 4న విడుదల చేయనున్నారు. కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్‌ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం.