మొత్తానికి “కబ్జా” అనుకున్నదే అయ్యిందిగా.!

ఎన్నో అంచనాలు మధ్య ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా “కబ్జా”. కన్నడ సినిమా నుంచి పలు భారీ హిట్స్ తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ వచ్చిన ఈ సినిమా మళ్ళీ కేజీఎఫ్ తరహా విజయాన్ని నమోదు చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ కేజీఎఫ్ తరహా విజయం ఏమో కానీ ఏకంగా కేజీఎఫ్ సినిమానే చూసినట్టు ఉందని చాలా మంది అంటుండడం గమనార్హం.

సినిమా టీజర్ చూసినప్పుడే చాలా మందికి ఆల్రెడీ కేజీఎఫ్ చూసినట్టే అనిపించింది అని అనేసారు. ఇక ట్రైలర్ రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగ్గా లేదు. దీనితో సినిమాపై మెల్లగా హైప్ తగ్గడం కూడా స్టార్ట్ అయ్యింది. కాగా ఈ భారీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫైనల్ గా ప్లాప్ టాక్ నే తెచ్చుకుంది.

అయితే ఎక్కువగా ఈ సినిమా అంతా దాదాపు గా కేజీఎఫ్ లానే ఉందని సినిమా మ్యూజిక్ ఏక్షన్ సినిమాలో ఫ్రేమ్ అన్నీ కూడా కేజీఎఫ్ లానే ఉన్నాయి. ఈ మాత్రం దానికి ఈ సినిమా చూడడం ఎందుకు అనుకుంటున్నారు. దీనితో అయితే అప్పుడు టీజర్ చూసాక చాలా మంది ఏమనుకున్నారో చివరికి ఈ సినిమా విషయంలో అదే జరిగింది అని చెప్పాలి.

కాగా ఈ సినిమాలో శ్రీయ శరన్ హీరోయిన్ గా నటించగా సుదీప్ మరియు శివ రాజ్ కుమార్ లు క్యామియో పాత్రల్లో నటించారు. అలాగే రవి బాసృర్ సంగీతం అందించాడు.