అంతా చూపిస్తెనే ఇక్కడ పనవుతుంది… బోల్డ్ కామెంట్స్ చేసిన నిధి అగర్వాల్..!

సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలంటే అందంగా ఉండటం చాలా అవసరం. అయితే ఈ ఇండస్ట్రీలో హీరోయిన్లు గా గుర్తింపు పొందాలంటే మాత్రం అందరికీ అందాలు చూపించాల్సిందే అంటూ హీరోయిన్ నిధి అగర్వాల్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇటీవల నిధి అగర్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

సవ్యసాచి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోంది. ఇలా హిట్ లాక్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన హార్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ హీరోయిన్ల అందాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ… ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలంటే టాలెంట్ ఉంటే అవకాశాలు రావు. మనలో ఉన్న అందాలను అందరికీ చుపిస్తేనే ఇక్కడ అవకాశాలు దొరుకుతాయి. ఇలా అందాలు చూపిస్తేనే హీరోయిన్లుగా అవకాశాలు పొంది ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ విషయం తెలియక కొంతమంది తమకేరిని మధ్యలోనే ఆపేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది