మా ఎన్నికలు రెండు నెలల ముందు నుండే వేడిని పుట్టిస్తున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వ్యక్తులు ఎవరికి వారు సొంత వ్యూహాలతో సిద్దమవుతున్నారు. పోటీలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ లాంటి వాళ్ళు ఉన్నారు.
వీరిలో ప్రధాన పోటీ విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితల నడుమ నెలకొనగా మిగతా పోటీదారులు ప్రధాన వ్యక్తుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్నారు. ఈ ఎన్నికలు మొత్తం ఎన్నో ఏళ్లుగా నానుతున్న మా కొత్త బిల్డింగ్ ఎజెండా మీదనే సాగుతున్నాయి. అభ్యర్థులు ఎవరికివారు తామే బిల్డింగ్ నిర్మాణం చేయగలమని బల్లగుద్ది చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు బయటికి వచ్చి సరికొత్త స్టేట్మెంట్ ఇచ్ఛారు. ఎన్నికలు మా కొత్త భవంతి ఎజెండా మీదనే జరుగుతున్నాయని, తాను తప్పకుండా బిల్డింగ్ కట్టి తీరుతానని అన్నారు. అంతేకాదు మా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తాను ఎన్నికల బరి నుండి తప్పుకుంటానని అంటున్నారు.
ఇండస్ట్రీ పెద్దలైన కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జయసుధ, బ్రహ్మానందం లాంటి వారంతా కలిసి ఒకరిని ఎంపిక చేసి ఈ వ్యక్తే అధ్యక్షుడు అంటే తాను పోటీలో ఉండనని అంటూ ఛాయిస్ పెద్దలకే వదిలేసారు. సో.. మరి పెద్ద తలలు కలిసి ఏకగ్రీవం చేస్తారో లేకపోతే ఎన్నికలే బెటర్ అంటారో చూడాలి.