అంతా అనిరుద్ చేతిలోనే.. 

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా చెప్పవచ్చు. అది ఎవరంటే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ అనే చెప్పాలి. కేవలం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూలానే భారీ హిట్ అయ్యిన సినిమాలు రీసెంట్ గానే వచ్చాయి.

ఇదే కాకుండా రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన చిత్రం “దేవర” గ్లింప్స్ లో కూడా హాలీవుడ్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. ఇలా మంచి డిమాండ్ తో ఉన్న అనిరుద్ తమ సినిమాకి కావాలంటే తమ సినిమాకి కావాలని ఆయా హీరోస్ ఫ్యాన్స్ కూడా అంటూ ఉంటారు.

ఇక ఇంత డిమాండ్ ఉన్న అనిరుద్ పై ఎంత వర్క్ ఉంటుంది? అందుకే ఇప్పుడు కొన్ని సినిమాల తాలూకా పరిస్థితి ఎలా మారింది అంటే అనిరుద్ ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడే ఆ సినిమా ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొందట. ఇది ఒక్క తమిళ్ సినిమాల్లోనే కాకుండా మన తెలుగు సినిమాల్లో కూడా ఉందని వినిపిస్తుంది.

దీనితో అనిరుద్ వర్క్ పెండింగ్ పడిందా ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతూ రావాల్సిందే అని సినీ పెద్దలు చెప్తున్నారు. దీనితో ఇప్పుడు అంతా అనిరుద్ చేతిలోనే ఉందని చెప్పక తప్పదు. ప్రస్తుతం అనిరుద్ తెలుగు తమిళ్ సహా హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.