Akshara Hasan: తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కమల్ హాసన్ అనే పేరు వినని వారుండరు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, విభిన్న పాత్రల్లో నటిస్తూ కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నారు కమల్. అంతటి ఘన్ చరిత్ర కలిగిన కమల్ హాసన్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఆయన వారసులురాళ్ళుగా వచ్చినా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుని పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
కాగా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి అభిమానులకు దగ్గరైన శృతి హాసన్, అక్షర హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ఐతే శృతి హాసన్ కి వచ్చినంత గుర్తింపు అక్షర హాసన్ కు అంతగా రాలేదనే చెప్పాలి. కానీ అప్పుడపుడూ ఆమె సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు చేస్తూ యాక్టివ్ గా ఉంటూ తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తోంది అక్షర.
ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం అచ్చం మడం నాణం పయిర్పు అనే సినిమాను గురించి చెప్పుకొచ్చింది. ఈ మూవీలో తాను ఒక టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తానన్న ఆమె, సంప్రదాయ కుటుంబంలో పుట్టి సామాజిక విలువలు కాపాడడానికి తనలో ఉన్న శృంగార కోరికలను ఎలా కాపాడుకుంటుంది అన్న యువతి కథే ఈ సినిమా అని ఆమె చెప్పుకొచ్చింది. ఐతే తాను నిజ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని, కానీ ఈ విషయంలో చాలా మంది టీనేజ్ లో తప్పులు చేస్తారని, వాటిని తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారని ఆమె చెప్పింది. అలా కాకుండా తమ బలం, బలహీనత ఏంటో తెలుసుకొని వాటిని నిరూపించుకోవాలి అని అక్షర చెప్పుకొచ్చింది. కుటుంబ విలువలను, అలాంటి కోరికలను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి అన్న అక్షర, పక్క వాళ్ళ జీవితం గురించి మాట్లాడడానికి మరొకరి హక్కు లేదని ఆమె వాదించింది. తాను ఇలా ఏం దాచుకోకుండా చెప్తాను కాబట్టే తాను చాలా మందికి నచ్చని అంటూ ఆమె వివరణ ఇచ్చింది.