Home News పవన్ సరసన నిధి అగర్వాల్ అంటే అందరికీ ఒకే గాని .. వాళ్ళు మాత్రం ..?

పవన్ సరసన నిధి అగర్వాల్ అంటే అందరికీ ఒకే గాని .. వాళ్ళు మాత్రం ..?

క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లో 27 వ సినిమా గా తెరకెక్కుతోంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా 15 రోజుల పాటు ఒక షెడ్యూల్ జరిగి ఆగిపోయింది. కాగా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా మొదలవ్వాల్సి ఉండగా అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం రీమేక్ కమిటయ్యాడు.

Pawan Kalyan And Director Krish To Collaborate For Pspk27 - Sacnilk

దాంతో క్రిష్ – పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయిందన్న వార్తలు వచ్చాయి. కాని డిసెంబర్ నుంచి క్రిష్ ఈ సినిమాని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్ లేకుండా కూడా సినిమాలోని కీలకమైన సీన్స్ ని కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి కూడా వీలున్నప్పుడు 2-3 రోజులు డేట్స్ సర్ధుబాటు చేసేలా కూడా రిక్వెస్ట్ చేశాడ క్రిష్.

ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ ని తీసుకునే ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒకే అన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకి నిధి ఫైనల్ చేసినట్టే అని త్వరలో షూటుంగ్ మొదలైతే నిధి సెట్ లో అడుగుపెడుతుందని అంటున్నారు. ఇదే గనక నిజమైతే నిధి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండస్ నటిస్తుందని సమాచారం. అంటే నిధీ సెకండ్ లీడ్ కావచ్చు అంటున్నారు. చూడాలి మరి మేకర్స్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారో. అయితే కొందరు మాత్రం ఈ ఇస్మార్ట్ గ్లామర్ బ్యూటికి పీరియాడికల్ మూవీ అంటే సెట్ అవుతుందా అన్న డైలమాలో ఉన్నారట.

- Advertisement -

Related Posts

మహేష్ బాబు సర్కారు వారి పాట ని ఆ సినిమాలకి టార్గెట్ గా రిలీజ్ చేయబోతున్నాడా ..?

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో త్వరలో సెట్స్ మీదకి రాబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమా తెరకెక్కబోతోంది. గీత గోవిందం ఫేం పరశురాం...

నాలుగేళ్లుగా స్టైలీష్ట్‌తో సమంత రిలేషన్.. మరీ అంత చనువా?

సమంత సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మద్య మాత్రం సమంతలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సమంత వస్త్రాధారణలో ఎంతో మార్పు వచ్చింది. అందాలను ఆరబోసేందుకే ఎక్కువగా...

సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన గ్యాంగ్ లీడర్ బ్యూటీ..?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి...

Pooja Jhaveri Interview Pics

Pooja Jhaveri Tamil Most popular Actress, Pooja Jhaveri Interview Pics ,Kollywood Eesha Pooja Jhaveri Interview Pics,Pooja Jhaveri Interview Pics Shooting spot photos, Pooja Jhaveri...

Latest News