ఈ సినిమా హిట్ అయినా హెబ్బా పటేల్ మాత్రం అక్కడే ఉండిపోయింది ..?

” అలా ఎలా ” అన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది హెబ్బ పటేల్. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సుకుమార్ నిర్మాణంలో వచ్చిన కుమారి 21 ఎఫ్ లో నటించిన హెబ్బా పటేల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో టాలీవుడ్ లో వరసగా అవకాశాలు దక్కించుకుంది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, 24 కిసెస్ ..ఇలా చాలా సినిమాలే చేసింది. కాని ఏ ఒక్క సినిమా కూడా కుమారి 21 ఎఫ్ మాదిరిగా భారీ హిట్ అందుకోలేదు.

అన్ని సినిమాలు యావరేజ్ .. బిలో యావరేజ్ గా నిలిచాయి. దానికి తోడు మిగతా హీరోయిన్స్ పోటీ కూడా హెబ్బా పటేల్ కి ఠఫ్ కాంపిటీషన్ గా మారింది. ముఖ్యంగా 24 కిసెస్ మీద భారీగా అంచానాలు పెట్టుకుంటే ఆ సినిమా దారుణంగా ఫ్లాపయింది. దాంతో హెబ్బా పటేల్ కెరీర్ చిక్కుల్లో పడింది. దాదాపుగా టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయినట్టే అని చెప్పుకున్నారు. కాగా అనూహ్యంగా మరోసారి యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా సినిమా చేసింది. చెప్పాలంటే ఈ సినిమా హెబ్బా పటేల్ కి రాజ్ తరుణ్ తో హ్యాట్రిక్ సినిమా.

అయితే ఈ సినిమా హిట్ అయినా కూడా హెబ్బా కి పెద్దగా ప్లస్ అయిందేమి లేదంటున్నారు. ఈ సినిమాలో మళవిక నాయర్ మరో హీరోయిన్ గా నటించగా ఎక్కువ క్రెడిట్ తనకే దక్కిందని చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఒరేయ్ బుజ్జిగా సినిమా సక్సస్ క్రెడిట్ దర్శకుడు హీరోకే వెళ్ళిందని అంటున్నారు. ఈ రకంగా హెబ్బా పటేల్ కి ఈ సినిమా ఉపయోగపడలేదని అంటున్నారు. ఇక రాం నటించిన రెడ్ అన్న సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. హీరోయిన్ గా చేసిన సినిమానే పెద్దగా ఉపయోగపడలేదంటే మరి ఈ స్పెషల్ సాంగ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.