శ్రీదేవి కూతురు అని కూడా చూడకుండా ఇంత దారుణమా – ఛి ఛీ !

శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరై హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తోంది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రిచ్చిన జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి కల నేరవేర్చింది. శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని కలలు కనేది. కాగా జాన్వీ కపూర్ తల్లి నుంచి తండ్రి నుంచి కూడా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ కిడ్ అయిన జాన్వీ కపూర్ కి కరన్ జోహార్ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది.

అయినా కూడా జాన్వీ కపూర్ ఇబ్బందులు ఎదుర్కొందట. వాస్తవంగా ఎంత టాప్ స్టార్స్ అయినా కూడా కొన్ని విషయాలని బయటకి పొక్కనీయరు. కానీ జాన్వీ కపూర్ మాత్రం నిర్మొహమాటంగా ఓపెన్ అయిపోయింది. జాన్వీ కపూర్ హీరోయిన్ కాక ముందు లాస్ ఏంజిల్స్ లో నటశిక్షణలో డిప్లామా చదువుకుందట. ఆ సమయంలో తన బోయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళిందట జాన్వీ కపూర్. అయితే చనువు తీసుకొని తనను వేధించాడని .. తప్పుడు ప్రపోజల్స్ పెట్టాడని వెల్లడించింది. పరిస్థితి అర్థం చేసుకున్న జాన్వీ కపూర్ ఏదో ఒకరకంగా ఆ రోజు తప్పించుకుందట.

ఆ అనుభవం తో ఇకపై ఎప్పుడూ తన జీవితంలో అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకొని రియలైజ్ అయినట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాలో నటిస్తుంది. కరణ్ తెరకెక్కించనున్న తక్త్ అన్న హిస్టారికల్ సినిమా అలాగే దోస్తానా 2లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా జాన్వీ కపూర్ ని టాలీవుడ్ కి తీసుకు వచ్చేందుకు మేకర్స్ ట్రై చేస్తున్నారు. వాస్తవంగా విజయ్ దేవరకొండ సినిమాలోనే నటించాల్సి ఉండగా డేట్స్ సర్దుబాటు కాక ఆ ఛాన్స్ మిస్ అయిందట.