ముద్దు పెడతానంటే తిరస్కరించిందట.. గుట్టు విప్పిన ఈషా రెబ్బా

తెలుగు తెరపై తెలుగు అందం కనిపించడం చాలా అరుదే. అచ్చమైన తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవించడం అంటే మామూలు విషయం కాదు. అసలు తెలుగు అమ్మాయిలకు అంతగా అవకాశాలు రావు.. వచ్చినా స్టార్ హీరోయిన్‌గా ఎదగరు. కానీ ఈషా రెబ్బా అనే హీరోయిన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. సినిమాల్లో అంతగా వేషాలు రాకపోయినా స్టార్ స్టేటస్ సంపాదించుకోకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నారు.

Eesha Rebba Says That She Refused A Kiss
Eesha Rebba Says That She Refused A Kiss

ఈషా రెబ్బాను, ఆమె అందాన్ని సోషల్ మీడియాలో ఆరాదిస్తుంటారు. దానికి తగ్గట్టే ఆమె ఫోటో షూట్లు కూడా ఉంటాయి. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసినా ఈషా రెబ్బా అందం మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఈమె షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తూ ఉంటుంది. ఇక మధ్య మధ్యలో ఈషా రెబ్బా తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. అందాన్ని పొగుడుతూ ట్వీట్లు చేస్తే లైకులు కూడా కొడుతూ ఉంటుంది.

Eesha Rebba Says That She Refused A Kiss
Eesha Rebba Says That She Refused A Kiss

తాజాగా ఈషా రెబ్బా కొన్ని చిలిపి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఎప్పుడైనా ఎవరైనా ముద్దు పెడతానంటే తిరస్కరించావా? అని ప్రశ్న ఎదురవ్వడంతో కాస్త సిగ్గుపడింది. సిగ్గు పడుతూనే అవును తిరస్కరించాను అంటూ సమాధానం చెప్పింది. అయితే ఎవరు ఎప్పుడు వంటి సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇక పరీక్షల్లో ఎప్పుడైనా కాపీ కొట్టావా? అని అడిగితే.. ఓ చాలాసార్లు అంటూ దాచుకోకుండా చెప్పేసింది.