సోలో రిలీజ్.! ఈ చెత్త కాన్సెప్ట్‌పై టాలీవుడ్‌లో మంట.!

‘ఈగిల్’ సినిమాని సోలో రిలీజ్ చేస్తారట.! సంక్రాంతి బరిలో దిగాల్సిన ‘ఈగిల్’, ఈ ‘సోలో’ హామీతోనే, ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా పడింది. నిజానికి, అదే రోజున మరికొన్ని సినిమాలు విడుదల కావాల్సి వుంది. ఆయా సినిమాల ప్రమోషన్లూ జోరుగానే సాగాయ్.

మాట ఇచ్చారు గనుక, పెద్దలనబడే కొన్ని సినీ గద్దలు రంగంలోకి దిగాయ్. రవితేజ ‘ఈగిల్’ సోలో రిలీజ్ కోసం లైన్ క్లియర్ చేసేశాయట కూడా. అసలు సోలో రిలీజ్ కాన్సెప్టే తప్పు.!

తెలుగు రాష్ట్రాల్లో బోల్డన్ని థియేటర్లున్నాయి. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది గనుక.. ఇతర రాష్ట్రాల్లోనూ మన సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఓవర్సీస్ మార్కెట్ సంగతి సరే సరి.

ఒకే రోజు రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చినా, థియేటర్లు సరిపోతాయ్. కానీ, అలా జరగడంలేదు. మొదటి రోజే మ్యాగ్జిమమ్ దోచేసుకోవాలన్న దుద్ద ఈ దుస్థితికి కారణం. ఇదేం పద్ధతి.? అని తెలుగు సినీ పరిశ్రమలో ఆత్మవిమర్శ షురూ అయ్యింది.

ఈ పైత్యంతోనే సినిమాని చంపేస్తున్నారంటూ థియేటర్లు చేతుల్లో పెట్టుకున్న నిర్మాతలపై మిగతా నిర్మాతలు గుస్సా అవుతున్నారట. ఈ మంట ముందు ముందు తెలుగు సినీ పరిశ్రమలో మంచి మార్పుకి కారణమవుతుందా.?