‘డంకీ’ నుంచి లుట్‌పుట్‌ గయా…పాట విడుదల

షారూక్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ’డంకీ’ రీసెంట్‌గా ’లుట్‌ పుట్‌ గయా..’ అనే సాంగ్‌ను ’డంకీ డ్రాప్‌ 2’గా మేకర్స్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. హార్డీ పాత్రలో షారూక్‌, మను పాత్రలో తాప్సీ మధ్య ఉండే ప్రేమను తెలియజేసే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టుకుంది. ఫ్యాన్స్‌, సినీ ప్రేక్షకులతో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాటకు ఫిదా అయ్యారు.

క్రిస్మస్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్‌ 21న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అయితే ’జవాన్‌’ సినిమాలో కుస్తీ గ్రౌండ్‌ మ్యాజిక్‌ను మరోసారి షారూక్‌ ’డంకీ’లోనూ తాప్సీతో రిపీట్‌ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి నెటిజన్స్‌ కొందరు సోషల్‌ విూడియాలో ’జవాన్‌’లో దీపికాతో.. ’డంకీ’లో తాప్సీతో.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. షారూక్‌, దీపిక ల మధ్య ’జవాన్‌’ (ఏజీలిజీని) మూవీలో చూపించిన కుస్తీ సీన్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో తెలియంది కాదు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను డంకీలోనూ రిపీట్‌ చేయబోతున్నారు కింగ్‌ ఖాన్‌. దీని గురించి ఫ్యాన్స్‌ చాలా ఎగ్జయిట్‌ అవుతూ షారూక్‌ సరికొత్త రొమాంటిక్‌ పంథాను కనుగొన్నారని మాట్లాడుకుంటున్నారు.

హీరోయిన్స్‌ అందరూ షారూక్‌ ఖాన్‌తో కుస్తీ చేయాలంటూ నెటిజన్‌ ఒకతను పోస్ట్‌ చేశారు. ’డంకీ’ చిత్రంలో టాలెంటెడ్‌ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్‌ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్‌, విక్రమ్‌ కొచ్చర్‌, అనీల్‌ గ్రోవర్‌ సహా బాలీవుడ్‌ బాద్‌ షా షారూక్‌ ఖాన్‌ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ బ్యానర్స్‌ సమర్పణలో రాజ్‌ కుమార్‌ హిరాణి, గౌరి ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.