బ్లాస్టింగ్ అప్డేట్స్ : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాసెస్ట్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. మరి ఎన్టీఆర్ నుంచి దాదాపు ఓ=మూడున్నరేళ్లు తర్వాత భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) లాంటి మాసివ్ సినిమాతో ఆడియెన్స్ ని పలకరించింది. పాన్ వరల్డ్ స్థాయిలో తాను భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివతో తన కెరీర్ లో 30వ సినిమాని ఎన్టీఆర్ చేస్తుండగా ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. దీనితో ఎన్టీఆర్ కూడా బయట పెద్దగా కనిపించట్లేదు. ఇక దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉండగా ఇప్పుడు మాత్రం వాళ్ళని ఖుషి చేసే రెండు బ్లాస్టింగ్ అప్డేట్స్ తెలుస్తున్నాయి.

ఇప్పుడు తారక్ వచ్చే ఈ రెండు వారాల్లో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్టుగా ఇండస్ట్రీ నుంచి తెలుస్తుంది. మరి వీటిలో తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన భారీ సినిమా “బింబిసార” పై ఆల్రెడీ మేకర్స్ భారీ అప్డేట్ అందించగా ఇక మరో సినిమా ఏమిటంటే..

యంగ్ హీరో హీరోయిన్ లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మరియు రష్మికా మందన్నా నటించిన చిత్రం “సీతా రామం” చిత్రానికి రాబోతున్నాడట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈ రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ లు ఉండబోతున్నాయని చెప్పాలి.