రామ్ చరణ్ రాజకీయం.! జనసేన ప్రస్తావన కూడా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హైద్రాబాద్, వైజాగ్.. ఇలా పలు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలో చరణ్ రాజకీయ నాయకుడిగా ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరించబడుతున్నాయి. అభ్యుదయం పార్టీ.. అని కనిపిస్తున్నా, జనసేన భావజాలం సినిమాలో కనిపించబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత రాజకీయాలపై శంకర్ మార్కు అస్త్రంగా ఈ సినిమా గురించి చెబుతున్నారు.

శంకర్ సినిమాల్లో రాజకీయ ప్రస్తావన ఖచ్చితంగా వుంటుంది ఏదో ఒక రూపంలో. కాగా, సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంటే, జనసేన నాయకులు కొందరు రామ్ చరణ్‌ని కలిశారు. ఈ క్రమంలో రాజకీయ అంశాలు చరణ్ – జనసేన నేతల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.