అమ్మ వడిలో ఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి ఈ క్రమంలోనే అభిమానులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అంటూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.తాజాగా మదర్స్ డే సందర్భంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి హీరోయిన్ చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తల్లి ఒడిలో అమాయకమైన చూపులు చూస్తూఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకు వచ్చింది.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చక్రం తిప్పుతూ ఉంది. తన అద్భుతమైన నటనకు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఇంత ముద్దుగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని మదర్స్ డే సందర్భంగా చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది అభిమానులను సందడి చేస్తోంది