చున్నీ చాటున దాగి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అన్ని భాషలకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్స్,పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా లో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ..ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ ఈ పోస్టులు పెడుతున్నారు. అలాగే ఈ ఫోటోలో దాగిఉన్న చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్, ఈ ఫోటోలో దాగి ఉన్న చిన్నోడు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అంటూ ఇలా రకరకాలుగా పోస్టులు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది హీరో,హీరోయిన్లు, సెలబ్రెటీలు ఫోటోలు బయట అయిన విషయం తెలిసిందే.

అయితే కేవలం చిన్నప్పటి ఫోటోలు మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో ఒక హీరోయిన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఆ హీరోయిన్ చున్నీని అడ్డుపెట్టుకుని చాటున దాగి ఉంది. మరి ఆ చున్ని చాటున దాగి ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. హీరోయిన్ మెహరీన్ కౌర్. టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హీరోయిన్ మెహరీన్.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా మెహరీన్ కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈమె డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకుని చున్నీ చాటున మొహాన్ని దాచుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మెహరీన్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈమె సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తు ఉంటుంది.