ఈ ఫొటోలో హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలింది.. ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం!

సాధారణంగా నటనపై ఆసక్తితో ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ పలు సినిమాలలో నటించి అనంతరం వెండితెరకు కనుమరుగవుతూ ఉంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో నటీమణులు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపి ప్రస్తుతం ఇండస్ట్రీకి కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..అదేనండి దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అనంతరం పోకిరతో జత కట్టి సందడి చేశారు.

ఇలా మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు తిరుగులేకుండా పోయింది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది. ఇక ఈమెకున్న క్రేజ్ చూసి దర్శక నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. అంతగా పాపులారిటీ సంపాదించుకొని ఒక దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని ఏలిన గోవా బ్యూటీ ఇలియానా అదే సమయంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురయింది.అయితే తెలుగు తమిళంలో కూడా క్రమక్రమంగా ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో పూర్తిగా ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి.

అయితే ప్రస్తుతం ఏ భాషలోనూ సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన అందాలను ఆరబోస్తూ క్లీవేజ్ షో చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. ఇలా సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా రోజురోజుకు అభిమానులను పెంచుకున్న ఈమె సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.