ప్రభాస్ ప్రాజెక్టు కే లో ముందుగా ఛాన్స్ కొట్టేసిన నటి ఎవరో తెలుసా

ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోని నాగ అశ్విన్ దర్శకత్వంలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ దీపికా పదుకొనే జంటగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకక్కుతున్నటువంటి చిత్రం ప్రాజెక్టు కే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది ఈమె కాదట.ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించడం కోసం ముందుగా మరొక హీరోయిన్ సెలెక్ట్ చేసినట్లు తాజాగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అశ్వినీ దత్ మాట్లాడుతూ ప్రాజెక్టుకే సినిమా కోసం ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ కోసం వెతికాము. ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేయాలని భావించాము. ఇదే సమయంలో డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం కథతో తమ వద్దకు వచ్చారని ఈ సినిమా కథ విన్న తర్వాత ఈ సినిమాకి మృణాల్ ఠాకూర్ అయితే సీతామహాలక్ష్మి పాత్రలో చాలా చక్కగా ఉంటుందని భావించాము. ఇదే విషయాన్ని డైరెక్టర్ హను రాఘవ పూడికి చెప్పి ఈ సినిమాలో తనని తీసుకోమని ప్రాజెక్టుకే కోసం మరొక హీరోయిన్ ను తీసుకుంటామని అశ్విని దత్ తెలిపారట.

ఈ విధంగా ప్రభాస్ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ బదులు దీపికా పదుకొనే నటిస్తున్నారని,మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ఈమె ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సీతమ్మగా నిలిచిపోయిందని, ఈ సినిమా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయని చెప్పాలి. ఇక ఈ సినిమాని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించడం విశేషం.