శ్రీముఖి ఎత్తుకున్న ఈ పాప ఎవరో తెలుసా?

Srimukhi: బుల్లితెర వ్యాఖ్యాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే వరుస బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ప్రత్యేక ఈవెంట్లలో కూడా శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. ఇక శ్రీముఖి ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

అయితే ఎయిర్ పోర్టులో ఉన్నటువంటి శ్రీముఖి ఒక చిన్న పాపని ఎత్తుకొని కనిపించారు.ఇక ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ ఎయిర్ పోర్టులో తాను ఎవరిని కలిసానో చూశారా అంటూ శ్రీముఖి ఆ చిన్నారిని ఎత్తుకున్న ఫోటోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు శ్రీముఖి ఎత్తుకున్న చిన్నారి ఎవరు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ చిన్నారి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…

శ్రీముఖితో కలిసి ఎంతో సరదాగా ఉన్నటువంటి ఆ చిన్నారి మరెవరో కాదు శ్రీముఖి స్నేహితురాలు, తన డిజైనర్ కీర్తన సునీల్ కూతురు. శ్రీముఖి తన డిజైనర్, వారి పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరందరూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.ఇలా ఎయిర్ పోర్టులో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలని శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే తన డిజైనర్ కీర్తన సునీల్ కూతురును ఎంతో ఆప్యాయంగా ఎత్తుకొని తనతో కలిసి దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.