సీరియల్ నటి నవ్య స్వామి ఎత్తుకున్న ఈ బుజ్జి పిల్లా ఎవరో తెలుసా?

Navya Swamy: కన్నడ యాక్టర్ గా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి నవ్య స్వామి గురించి అందరికీ తెలిసిందే. ఈమె స్వస్థలం కర్ణాటక అయినప్పటికీ తెలుగు నటిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా సీరియల్ ద్వారా ఎంతో బిజీగా ఉన్న ఈమె నటుడు రవి కృష్ణతో కలిసి ఆమె కథ సీరియల్ లో నటించారు. ఇక ఈ సీరియల్ లో వీరిద్దరి జోడి అద్భుతంగా ఉండటమే కాకుండా వీరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.

వీరి గురించి వస్తున్న ఈ వార్తలను పూర్తిగా వీరిద్దరూ ఖండించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ జోడి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా నవ్య స్వామి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక చిన్నారిని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు నవ్య స్వామి ఎత్తుకున్న ఈ బుజ్జి పాపాయి ఎవరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ చిన్నారి ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే ఆమె మరొక నటి, యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ గారాలపట్టి భూమి అని తెలుస్తోంది.హరితేజ కూతురు భూమి మొదటి పుట్టిన రోజును జరుపుకోవడంతో నవ్య స్వామి తనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ తనకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం నవ్యస్వామి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు చిన్నారి భూమికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.