బిగ్‌బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ ఎవరో తెలుసా…?

బిగ్‌బాస్‌ సీజన్‌`7 చెప్పినట్లు ఉల్టా `పుల్టాగా సాగుతోంది. ఇంట్లో ఉన్న సభ్యుల్లో కొందరు మాత్రమే ఆట సరిగ్గా ఆడుతున్నారు. కొందరు తూతూ మంత్రంగానే లాగిస్తున్నారు. మైండ్‌గేమ్‌ ఆడేవాళ్లల్లో శివాజీ ఒకరు. తనకంటే ఒక ఫ్యాన బేస్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ సీజన్‌`7 చెప్పినట్లు ఉల్టా `పుల్టాగా సాగుతోంది.

ఇంట్లో ఉన్న సభ్యుల్లో కొందరు మాత్రమే ఆట సరిగ్గా ఆడుతున్నారు. కొందరు తూతూ మంత్రంగానే లాగిస్తున్నారు. మైండ్‌గేమ్‌ ఆడేవాళ్లల్లో శివాజీ ఒకరు. తనకంటే ఒక ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే ఇంట్లో టాప్‌ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా ఉన్న శివాజీని బయటకు పంపారు. అదో పెద్ద సంచలనంగా మారింది. ఇదంతా అయ్యాక సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ శివాజీని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి చెయ్యి ఎలా ఉందో అడిగారు.

కొంత ఇబ్బందిగానే ఉందని శివాజీ సమాధానమిచ్చారు. దీంతో బిగ్‌ బాస్‌ ‘శివాజి.. విూరు వైద్య పరీక్షల కోసం బయటకు రావాల్సి ఉంటుంది. స్కానింగ్‌ అయిన తర్వాత మళ్లీ లోపలికి పంపుతాము. ఈ విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పి బయటకు రండి’ అని చెప్పాడు బిగ్‌బాస్‌. దాంతో శివాజీ కంటెస్టెంట్స్‌ అందరినీ గార్డెన్లోకి పిలిచి ‘నేను వెళ్లొస్తాను’ అంటూ మెయిన్‌ గేట్‌ వైపు వెళ్లాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆయన ఎలిమినేట్‌ అవుతున్నాడని అనుకుని కన్నీరుమున్నీరయ్యారు. అప్పుడు శివాజీ అసలు విషయం చెప్పాడు. అయినా ఎవరూ నమ్మలేదు. ప్రశాంత్‌, యావర్‌ విపరీతంగా ఏడ్చారు. శివాజీ వెళ్లిన కాసేపటికి స్టోర్‌రూమ్‌లో బెల్‌ మోగింది. కాఫీ పౌడర్‌ను పంపించారు. అది చూసిన అమర్‌దీప్‌ ‘కాఫీ పంపించారు అంటే శివాజి అన్న మళ్లీ వస్తున్నారు’ అని అర్థం అన్నాడు.

దీంతో అందరూ సంతోషపడ్డారు. ఆ కాసేపటికే శివాజి హౌస్‌లోకి అడుగు పెట్టాడు. బిగ్‌ బాస్‌ కాఫీ పౌడర్‌ పంపించడంతో శివాజి సర్‌ప్రైజ్‌ ఫీల్‌ అయ్యాడు. అనంతరం కెప్టెన్‌ ప్రిన్స్‌ యావర్‌ను తనకు సహాయం చేయడం కోసం ఇద్దరు డిప్యూటీలను ఎంపిక చేసుకోవాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. అతను శివాజీ సందీప్‌లను ఎంచుకున్నాడు. వాళ్లిద్దరికి కూడా కెప్టెన్‌కు లభించిన ఇమ్యూనిటీ మినహా అన్ని సదుపాయాలు ఉంటాయని వివరించాడు.

ఇలా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శివాజికి బిగ్‌ బాస్‌ కాఫీని, యావర్‌ డిప్యూటీ పవర్‌ను ఇచ్చారు. శివాజీ పట్ల బిగ్‌ బాస్‌ చూపిస్తున్న ప్రేమను చూసిన కొందరు తప్పుబడుతున్నారు. అతడికి కాఫీ అంటే ఇష్టం అని లగ్జరీ బడ్జెట్‌లో కాకుండా స్పెషల్‌గా పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలాగే ఉంటే శివాజీనే విన్నర్‌గా ప్రకటిసారేమో అంటూ సోషల్‌ విూడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఏదేమైనా శివాజీ బయటకు వెళ్లడం, రావడం మాత్రం హైప్‌ క్రియేట్‌ చేసింది. అతనిని కాఫీ ఇస్తూ, లగ్జరీగా చూసుకోవడాన్ని కొందరు సహించలేకపోతున్నారు. ఇదంతా జరిగి రెండు రోజులు అవుతున్నా నెటిజన్లు మాత్రం శివాజీ టాపిక్‌ను వదలడం లేదు.