శేఖర్ మాస్టర్ రోల్ మోడల్.. ఏకంగాఅతని ఫోటో షేర్ చేస్తూ..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ప్రస్తుతం ఎన్నో సినిమాలలో కొరియోగ్రాఫర్ గా అవకాశం అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు హాజరవుతూ తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా,స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు.

అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునీ రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ విధంగా డాన్స్ లో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే శేఖర్ మాస్టర్ ఇప్పటికే పలు అవార్డులను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. తను ఇలా డాన్స్ వైపు అడుగులు వేస్తూ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి కారణమైన వ్యక్తిని పరిచయం చేశారు.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ప్రభుదేవానే తన రోల్ మోడల్ అంటూ చెప్పుకొచ్చారు.ఇక ప్రభుదేవా షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే శేఖర్ మాస్టర్ ఇన్ని రోజులు ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీడాన్స్ షో కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని కామెడీ స్టార్స్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.