Sudigali Sudheer: సుధీర్ తన మొబైల్ లో రష్మీ పేరును ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా ?

Sudigali Sudheer: బుల్లితెరపై వారి జోడీ గురించి తెలియని వారుండరు. వారిద్దరి మధ్య ఏం లేదని ఎంత పబ్లిక్ గా చెప్పినా ప్రేక్షకులు మాత్రం నిజంగా ఈ జంట ఒక్కటైతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంతకీ వారిద్దరూ ఎవరో కాదు .. జబర్దస్త్ ద్వారా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్న రష్మీ, అదే కామెడీ షో ద్వారా ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సుధీర్.

గత పదేళ్లుగా తమ మధ్య ఏం లేదంటూనే, స్మాల్ స్క్రీన్ పై ది బెస్ట్ జోడీగా నిలుస్తున్నారు సుధీర్ – రష్మీ. వారిద్దరూ కలిసి ఏదైనా ఈవెంట్ చేస్తున్నారు అంటే ఇక ప్రేక్షకులకు పండగే. వాళ్ళు ఏం చేసినా కూడా వీక్షకులను విందుగానే తోస్తుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉండే కెమిస్త్రీ, అండర్ స్టాండింగ్, టైమింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కామెడీ, డాన్స్, పాట ఏది చేసినా వీరిద్దరి జోడీ ఆ షోకి ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు.

కనిపించేది టీవీ లోనే ఐనా, ఓ స్టార్ హీరో, హీరోయిన్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్లకు ఉందంటే మామూలు విషయం కాదు. అయితే తెలుగు అభిమానులను ఇంతగా అలరించే ఆ ఇద్దరూ నిజ జీవితంలో కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అన్న సత్యాన్ని మాత్రం కొందరు అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు అంటే ఆ జోడీ ఎంత ఫర్పెక్ట్ కపుల్ లో తెలుస్తూనే ఉంది. అయితే తెరపై ఇంత క్లోజ్ గా యాక్టింగ్ చేసే వీళ్లు తమ ఫోన్ లో వారి కాంటాక్ట్ ను ఏం పేరుతో సేవ్ చేసుకున్నారో తెలుసా ? అది తెలియాలంటే ఇది చదవాల్సిందే.

ఇటీవల స్టార్ మా ఛానెల్ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో వీరి పర్సనల్ విషయాలు కొన్ని బయట పడ్డాయి. సుధీర్ తన మొబైల్ ఫోన్ లో రష్మీ పేరును ఏమని పెట్టుకున్నాడో చెప్పి, అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తాను ఇంతకు ముందు రష్మీ అనే సేవ్ చేసుకున్నాడట. కానీ ఇటీవల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో బిజీగా ఉండడంతో ఓపెనింగ్స్ అని పెట్టుకున్నాడని సుధీర్ చెప్పడం అందర్నీ నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు మళ్లీ రష్మీ అనే సేవ్ చేసుకున్నా అని చెప్పడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది. ఇలా వారి గురించి ఏ చిన్న విషయం వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ట్రెండింగ్ లో నిలుస్తున్నారు సుధీర్ – రష్మీ జోడీ.