KGF 2 : ప్రపంచం అంతా కే జి ఎఫ్ 2 సినిమా మానియా లో పడింది.రాకీబాయ్ పెర్ఫార్మన్స్ కి అందరు ఆశ్చర్యబోతున్నారు. సిని అభిమానులకి ఈ సినిమాలోని యష్ స్టైలిష్ నటనా యాక్షన్ సీన్లు బాగా నచ్చాయి. ఇందులో నటించిన మిగిలిన నటులకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విడుదలైన మొదటి అటనుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొడుతుంది అనే టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలోని ప్రధాన నటుల నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే సినిమాలో ప్రాముఖ్యం ఉన్నా మరో వ్యక్తి ఎడిటర్ ఏ సీన్ ఏ యాంగిల్ లో చూపించాలో ఎడిటర్ కట్ లోనే ఉంది.అలాంటిది కేజీఫ్ 2 లాంటి ప్రతిష్టత్మక చిత్రానికి ఆ బాధ్యత మరి ఎక్కువగా ఉంటుంది.అలాంటి కష్టతర బాధ్యతను ఒక 19ఏళ్ల కుర్రాడి చేతిలో పెట్టారు ప్రశాంత్ నీల్.అవును ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి పేరు మారుమ్రాగిపోతోంది.ఈ సినిమా కోసం తనలోని అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి.. ఎడిటర్ గా సినిమా చూసిన ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేశాడు. కేవలం 19 ఏళ్ళ వయస్సు కలిగిన ఉజ్వల్.
అసలు ఈ అబ్బాయ్ ని నమ్మి ప్రశాంత్ అంత పెద్ద భాద్యతను ఎలా అప్పగించారనే అనుమానం వస్తుంది అందరికి.వయస్సుతో సంబంధం లేకుండా ఉజ్వల్ లోని హై లెవెల్ టెక్నికల్ టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారట డైరెక్టర్.యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్స్, ఫ్యాన్ మేడ్ వీడియో ఎడిట్స్ చూసి ఉజ్వల్ పనితీరు నచ్చి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 అవకాశం ఇచ్చారట. ఇప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఉజ్వల్ వర్క్ ని కొనియాడుతున్నారు.