Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా ఎంతో ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ బుల్లితెర కార్యక్రమాల ద్వారా తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ కు వంటలు చేయడం ఎంతో ఇష్టమని గతంలో వెల్లడించారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమయంలో మటన్ బిర్యానీ వండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఇలా వంట చేయడంలో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా పలు సందర్భాలలో తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తనకి ఇష్టమైన ఫుడ్ గురించి చెబుతూ.. రాయలసీమ ఫేవరేట్ నాటుకోడి పులుసు, మిరపకాయ గారే అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన ఫుడ్ అని వెల్లడించారు. అయితే ఫుడ్ విషయంలో ఎన్టీఆర్ ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా మనస్ఫూర్తిగా తింటారని, అందుకు తగ్గ వ్యాయామాలను కూడా చేస్తానని ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ సినిమాతో బిజీకానున్నారు.