ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా సినిమాకు కొత్తదనాన్ని కనబరుస్తూ ఎంతో భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో చురుకుగా ఉండే అల్లుఅర్జున్ ప్రతిరోజు తను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు… అతని డైట్ ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉదయం 45 నిమిషాలపాటు త్రెడ్ మిల్ రన్ చేస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలి.ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా ఎక్కువగా కూరగాయలు ఫ్రూట్ షేక్ తీసుకుంటారు. అనంతరం సాయంత్రం ఏదైనా ఉడకబెట్టిన గింజలు చిలగడదుంపలు వాటిని ఆహారంగా తీసుకుంటారు. రాత్రి భోజనంలో భాగంగా బ్రౌన్ రైస్ మొక్కజొన్న సూప్, బీన్స్ మరియు సలాడ్ లను ఎక్కువగా తీసుకుంటారు.
ఈ విధంగా అల్లు అర్జున్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ తన ఫిట్నెస్ కాపాడుకుంటూ వస్తున్నారు. అల్లుఅర్జున్ ముఖ్యంగా పాల పదార్థాలు చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉంటూ తన డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప సినిమాతోనే ఇంత మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తదుపరి పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానున్నారు.