NTR: బ్రాండెడ్ వస్తువులు, ఢిపరెంట్ కార్లు, వాచ్‌లు వాడడం చాలా మంది చేస్తుంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెలబ్రెటీలు ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు. మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ వస్తువూ తమ సొంతం చేసుకోవాలని మరీ కొంత మంది తారలు ఉబలాటపడతారు. ఎందుకంటే కొందరు హీరోలు, హీరోయిన్‌లకు లక్షల్లో, కోట్లల్లో అభిమానులు ఉంటారు. వాళ్లను ఆకట్టుకునేలా, ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్టుగా ట్రెండ్‌ను ఫాలో అవుతూ తమ ఇమేజ్‌ను మరింత పెంచుకుంటుంటారు.
అయితే ఇలాంటి విషయాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకాస్త ముందుంటాడనే చెప్పవచ్చు. కోట్ల విలువ కార్లు కొనడం, బ్రాండెడ్ వస్తువులు ఉపయోగించడం, డిఫరెంట్ లైఫ్‌స్టైల్ ఐటమ్స్ కు ప్రాధాన్యతనివ్వడం కొత్తేమీ కాదు. గతేడాది జరిగిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లోనూ తారక్ ఖరీదైన వాచ్ ధరించి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. రిచర్డ్ మిల్లే RMకు చెందిన 011 కార్భన్ NTPT గ్రోస్టిన్ అనే బ్రాండెడ్ వాచ్‌తో కనిపించి సందడి చేశాడు. ఇక దీని ధర విషయానికొస్తే నాలుగు కోట్ల రూపాయలట.
అదే తరహాలో ఎన్టీఆర్ మరోసారి బ్రాండెడ్ వస్తువులు వాడడంలో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లు వసూలు చేయడంలో చిత్ర బృందం ముంబైలో ఓ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు పలు సెలబ్రెటీలు సైతం పాల్గొన్నారు. కాగా ఈ ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న వాచ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కెమెరాలన్నీ ఒక్కసారిగా ఆయన పెట్టుకున్న వాచ్‌పైన పడడంతో దాని గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. తారక్ చేతికి పర్ఫెక్ట్‌గా సరిపోయిన ఆ గడియారం గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీనే ఉంది. ఆ వాచ్ పేరు Petek Philippe Nautilus 5712 1/A. విదేశాలకు చెందిన ఈ బ్రాండెడ్ వాచీ కోసం ఎన్టీఆర్ ఏకంగా కోటీ 70 లక్షల పైనే ఖర్చు చేసినట్టు సమాచారం. ఇదొక్కటే కాదు ఇంతటి ఖరీదైన వాచీలు ఆయన దగ్గర మరికొన్ని ఉన్నాయని టాక్. ఇక ఇటీవలే అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారును కొనుగోలు చేసి అందరినీ ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.