అక్కినేని వారసుడిగా అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున ఆయన వారసుడిగా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా గత దశాబ్దాల నుంచి నాగార్జున ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మందికి అభిమాన నటుడిగా మారిపోయారు. ఇక ప్రస్తుతం ఆరు పదుల వయస్సులో ఉన్నప్పటికీ నాగార్జున వరుస సినిమాలు, టీవీ షోలతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే తన కొడుకులు అఖిల్ నాగచైతన్యకు పోటీగా నాగార్జున సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా నాగార్జున వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇలా ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుని నాగార్జున భారీగానే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఆయన పలు వ్యాపార రంగాలలో కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియో ద్వారా భారీ మొత్తంలో నాగార్జున సంపాదిస్తున్నారని చెప్పాలి. పలు సర్వేల ప్రకారం ఇప్పటి వరకు నాగార్జునకు 3010 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
ఏది ఏమైనా నాగార్జున ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో అడుగుపెట్టే బాగా డబ్బు సంపాదించారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది తన కొడుకుతో కలిసి బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం ఈయన ఘోస్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు