Mumaith Khan: వారానికి బిగ్ బాస్ నుంచి ముమైత్ ఖాన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Mumaith Khan:బుల్లితెరపై వివిధ భాషలలో ప్రసారం అవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఇలా తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహకులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా 24 గంటల పాటు ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని గత నెల 26వ తేదీ 17 మంది కంటెస్టెంట్ లతో ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఒక వారానికి పూర్తిచేసుకుని ఈ కార్యక్రమం మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు.

మొదటి వారం నామినేషన్ లో భాగంగా ఏడుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉండగా ముమైత్ ఖాన్ మొదటగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన ఈమె హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు తనని ఎగ్రసీవ్ అంటూ తనపై ముద్ర వేశారని,ఉద్దేశపూర్వకంగానే కంటెస్టెంట్ లు నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని ఎమోషనల్ అయ్యారు. అయితే నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చానో ఇప్పుడు అర్థం కాదు తర్వాత సీజన్ లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని ఈమె తెలియజేశారు.

ఇలా వారం రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను సందడి చేసిన ముమైత్ ఖాన్ మొదటి వారం ఎలిమినేట్ కావడంతో ఈమెకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే వారం రోజులపాటు ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను సందడి చేసినందుకు గాను ఈమెకు ఎనభై వేల రూపాయల చొప్పన రెమ్యూనరేషన్ అందించినట్లు సమాచారం.ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా 11 మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు బయటకు రానున్నారు అనే విషయం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.