మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు..సిరివెన్నెల సీతారామశాస్త్రికి చాలా దగ్గరి సంబంధం ఉంది. త్రివిక్రమ్ మొదట రైటర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. స్వయం వరం చిత్రానికి మొదట అతడు రైటర్ గా పని చేశాడు. తర్వాత నువ్వే కావాలి సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్శించారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అని ఊరికే అనలేదు. అతడి మాటల్లో పంచు డైలాగులు.. తేలికైన పదాలు ఉంటాయి. అంతటి స్పెషాలిటి కలిగి ఉన్న ఘనుడు త్రివిక్రమ్. అతడి కలం వెంట జాలు వారిన ప్రతీ పదం మనస్సుకు హత్తుకునేలా ఉంటుంది.
ఇక త్రివిక్రమ్ కెరీర్ పరంగా చూస్తే.. రైటర్ గానే కాకుండా అతడు దర్శకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్ విషయం తెలిసిందే. త్రివిక్రమ్ వ్యక్తిత్వ వికాసం నచ్చే.. సిరివెన్నెల స్వయంగా అతడి ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అక్కడికి వెళ్లిన త్రివిక్రమ్ అతడు చేసుకునే అమ్మాయిని కాకుండా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూతురును ఇష్టపడ్డాట. ఆ సమయంలోనే ఈ విషయాన్ని చెప్పగా.. కొంచెం టైం తీసుకొని.. అతడికి మళ్లీ కబురు పెట్టి..అర్థం చేసుకొని పెళ్లికి ఒప్పుకున్నారట.
అలా త్రివిక్రమ్-సౌజన్యల వివాహం జరిగింది. ఈ సౌజన్య సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా సోదరుడి కూతురే. అలా వీరి పెళ్లి జరిగిపోయింది. అయితే త్రివిక్రమ్ మొదట చేసుకోవాలని అనుకున్న అమ్మాయి.. సౌజన్యకు స్వయానా సోదరి. ఆ ఇంట్లో ఈమె చిన్నమ్మాయి.. మొదట పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి పెద్దమ్మాయి. ఇలా అతడి పెళ్లి.. సినిమా స్టైల్లో అయిపోయింది. ఇలా సిరివెన్నెల, త్రివిక్రమ్ ల మధ్య మామ అల్లుళ్ళ బంధుత్వం ఏర్పండింది.