సుహాసిని తెలుగుపేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.నిన్నటి తరం కథానాయకగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలందరూ సరసన నటించిన ఓ వెలుగు వెలిగిన సుహాసిని ఉన్నఫలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
ఇండస్ట్రీలో ఈమె దర్శకుడు మణిరత్నంను వివాహం చేసుకున్న అనంతరం ఈమె సంసార బాధ్యతలను మోస్తూ సినిమాలకు దూరమయ్యారు. అదేవిధంగా సుహాసినితో పాటు కలిసిన నటించిన హీరోయిన్లు గ్లామర్ విషయంలో ఎలాంటి నియమాలు పెట్టుకోకుండా గ్లామర్ సినిమాలు చేస్తూ నటించేవారు కానీ ఈ విషయంలో మాత్రం సుహాసిని గ్లామర్ షో కి పూర్తిగా దూరంగా ఉండేది. అయితే సుహాసినితో పాటు కలిసి నటించినటువంటి ఎంతో మంది హీరోయిన్లు తిరిగి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
వీరితోపాటు నటించినటువంటి సుహాసిని మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా సినిమాలు చేయలేదు. ఈమె తలుచుకుంటే ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేయవచ్చు అయితే ఈమె కథలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారని అవకాశం వచ్చిన ప్రతి సినిమాని అందుకోకుండా మంచి కథ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలలో నటించడానికి ఒప్పుకునేవారు అందుకే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా సినిమాలను చేయలేదు.