Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో ది హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం రాజమౌళి. సినిమాలు తీయడంలో దిట్టగా పేరు గడించిన ఆయన ఘనత రోజు రోజుకూ ప్రపంచమంతటా నలుమూలలా వ్యాపిస్తూ వస్తోంది. కారణం ఆయన అసాధారణ కృషి, పట్టుదలే. ప్రస్తుతం ట్రెండింగ్ వన్‌లో దూసుకుపోతూ ఆయన సినిమాల పరంపరతో దుంధుభి మోగిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు ఎవరైనా తీయగలరేమో గానీ, అంతే బడ్జెట్‌కు సమాన స్థాయిలో ఉన్న కథ ఉన్నపుడే ఆ చిత్రం సక్సెస్‌కు దారి తీస్తోంది. అలాంటి కథలు సమకూర్చుటలో తెలుగు ఇండస్ట్రీలోనే ఆయనంత నేర్పరి, దిట్ట మరొకరు లేరని టాక్.
కాగా పలువురు తెలుగు హీరోలు సైతం స్టార్ హీరో స్టేటస్‌ను అందుకోవడానికి కూడా పరోక్షంగా రాజమౌళి కారణమవుతూ వస్తున్నారు. అయితే డైరెక్టర్‌గా టాప్ రేంజ్ లో ఉన్నప్పటికీ ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నప్పటికీ రాజమౌళి ఆ గర్వాన్ని ఏ మాత్రం ప్రదర్శించరు. తన డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోలు కొన్ని సంవత్సరాల పాటు ఆ సినిమా వర్కింగ్‌లో ఉండాలని, అప్పటి వరకూ వేరొక సినిమాకు పని చేయకూడదనే షరతులు పెడతాడరని సమాచారం. అందుకే కాబోలు ఆయన తీసే సినిమాలు ఎప్పటికీ రీఫ్రెషింగ్ అనిపించేటట్టు ఉంటాయని ప్రేక్షకుల భావన.
ఇదిలా ఉండగా అసలు రాజమౌళి అంత గొప్ప డైరెక్టర్‌గా ఎదగడానికి కారణం ఏంటీ అనే ప్రశ్న అందరూ అడిగేదే.. ఆ ప్రశ్నకు ఆయనే స్వయంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఓటమి మీద ఉన్న భయంతోనే తాను పెద్ద కల కనేలా చేస్తుందని, తాను ఎప్పుడు సినిమా తీయాలన్న ముందు తీసిన దానికి మించి ఉండాలి కోరుకుంటానని ఆయన చెప్పారు. తన ప్రతీ సినిమాలోనూ ఓ మ్యాజిక్‌ను సృష్టించాలనే భయం ఎప్పుడూ తనను వెంటాడుతూ ఉంటుందన్న ఆయన, ఆ భయంతోనే సక్సెస్‌ను అందుకుంటున్నా, దాని వల్లే మరింత మెరుగ్గా పనిచేయడానికి కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఇకపోతే ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్ త్వరలోనే రిలీజ్ కానుండగా, ఎప్పటిలాగే రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.