Thaman: తమన్ వరుస విజయాల వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

Thaman: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకి లేస్తారో, ఎప్పుడు చప్పున పడిపోతారో ఎవరూ ఊహించలేరు. కొందరు ఒక్క క్యారెక్టర్‌తో స్టార్ అవుతారు. మరికొందరు ఒక్క సాంగ్‌తో, ఇంకొందరు ఒక్క సినిమాతో. కానీ ఆ ఒక్క అనే పదాన్ని చేరుకోవడానికి వారి చేసే శ్రమ అంతా ఇంతా కాదు. ఒక్కసారి హైప్ వచ్చిందంటే మళ్లీ దాన్ని నిలబెట్టుకోవాలంటే, అదీ సినీ పరిశ్రమలో చాలా కష్టంతో కూడుకున్నది. కానీ శ్రద్దగా చేస్తే, అ ఇమేజ్ అయినా, ఏ పాపులారిటీ అయినా కలకాలం ఉండిపోతాయి. కొందరికీ చాలా ఈజీగా అవకాశాలు వస్తాయి. మరికొందరికీ ఎంతో కష్టపడితే గానీ రావు. అలాంటి కోవకు చెందిన వారే మ్యూజిక్ డైరెక్టర్ థమన్.

ప్రస్తుతం ఎక్కడ విన్నా థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్కే వినిపిస్తోంది. హీరోలంతా ఇప్పుడు థమనే తమ సినిమాకు మ్యూజిక్‌ను ప్రిపేర్ చేయాలని అడిగి మరీ చేయించుకుంటున్నారట. కానీ ఇది జరగడం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 14ఏళ్ల తర్వాత ఇప్పుడు థమన్‌కు టైమ్ వచ్చిందంటూ ఆయన్ను అభిమానులు కీర్తిస్తున్నారు. కాపీ మ్యూజిక్ చేస్తాడని ఎన్నో విమర్శలు వచ్చినా, వాటన్నిటినీ దాటుకొని, ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారంటే మామూలు విషయం కాదు.

మొన్నటికిమొన్న అఖండ సినిమాతో తన ఇన్ని సంవత్సరాల పాటు లోన దాచుకున్న టాలెంట్‌ను అంతా బహిర్గతం చేసి, అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు. ఇక ఇటీవల మహేశ్ బాబు హీరోగా చేసిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఆయనకు ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇదే అదనుగా థమన్ తన రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచినట్టు సమాచారం. కానీ ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే, అందరికీ నచ్చేలా మ్యూజిక్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకోసం తనకు వచ్చిన రెమ్యునరేషన్‌లో చాలా భాగం వరకూ మ్యూజిక్ ఇన్స్‌స్ట్రూమెంట్ర్, వేరే దేశం నుంచి గాయకులను రప్పించడం లాంటి వన్నీ చేస్తారని టాక్. అందువల్లనే ప్రస్తుతం థమన్ టాప్‌ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌లలో ముందంజలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం గమనిస్తే ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు 10 సినిమాల వరకూ ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ కూడా వినిపిస్తోంది.