Nagababu: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవికి తమ్ముడిగా, పవన్ కళ్యాణ్ కి అన్నగా మాత్రమే కాకుండా నాగబాబు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన నాగబాబు, రామ్ చరణ్ హీరోగా నటించిన “ఆరెంజ్ ” సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో నాగబాబు మరి నిర్మాణ రంగం వైపే చూడలేదు. అయిన మంచి నటుడిగా గుర్తింపు పొందిన నాగబాబు ఇటీవల విడుదలైన బంగార్రాజు సినిమా లో యముడి పాత్రలో నటించాడు.
ఇదిలా ఉండగా ఈ టీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా జడ్జ్ గా ప్రేక్షకుల ఆదరణ పొందిన నాగబాబు నవ్వుల నాగబాబు గా పేరు పొందారు. ఎన్నో సంవత్సరాలు జబర్దస్త్ షో కి జడ్జ్ గా ఉన్న నాగబాబు కొంతకాలం క్రితం అనూహ్యంగా జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. అందుకు మల్లెమాల వారితో ఉన్న భేదాభిప్రాయాలు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. దాని తర్వాత అదిరింది అనే కామెడీ షో కి జడ్జ్ గా ఉన్నారు.కొన్ని కారణాల వల్ల ఆ షో నిలిచిపోయింది. కొంత కాలం టీవీ షోస్ కి దూరంగా ఉన్న నాగబాబు తిరిగి కామెడీ స్టార్స్ అనే షో కి జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ షో నాగబాబు వల్లే మంచి రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది అనటంలో సందేహం లేదు. నాగబాబు తో కలిసి శేఖర్ మాస్టర్ కూడా ఈ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక జబర్దస్త్ నుండి కూడా కొంతమంది కామేడియన్లు ఈ షో కి ఎంట్రీ ఇవ్వటంతో ప్రస్తుతం ఈ షో జబర్దస్త్ కి పోటీగా సాగుతోంది. అయితే ఈ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు 2 నుండి 3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భవిషత్తు లో ఈ షోకి ఇంకా రేటింగ్స్ పెరిగితే నాగబాబు రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది.