హీరో సూర్య మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈయన కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తమిళంలో తెరకెక్కిన సూర్య సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంటాయి.ఇలా ప్రస్తుతం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సూర్య ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివకుమార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూర్య తనకు పెద్ద కుమారుడు.అప్పట్లో వీరి కుటుంబా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండేది ఇక సూర్య పెద్దవాడు కావడంతో ఈయన డిగ్రీ వరకు పూర్తి చేశారు.సూర్య డిగ్రీ చదువుతున్న సమయంలో తన తమ్ముడు కార్తీ ఇంటర్ చెల్లెలు పదవ తరగతి చదువుతున్నారు.అప్పటికే సూర్య ఇంట్లో ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురవడంతో డిగ్రీ పూర్తి చేసిన ఏదైనా ఉద్యోగం కోసం రెండు నెలల పాటు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఈ విధంగా రెండు నెలలపాటు కష్టపడి ఈయన ఒక బట్టల దుకాణంలో పనిచేశారు. ఈ విధంగా బట్టల దుకాణంలో పనిచేస్తున్నందుకుగాను సూర్య మొదటిసారిగా 1200 రూపాయల జీతం తీసుకున్నారు. ఇదే సూర్య మొదటి సంపాదన.ఈ విధంగా తాను సంపాదించిన మొదటి జీతంతో ముందుగా సూర్య తన చెల్లెలు తన తల్లికి చీరలు కొన్నారు. ఈ విధంగా సూర్య డబ్బులు సంపాదిస్తూ తన చెల్లెలు తమ్ముడి బాధ్యతలను తానే చూసుకున్నారు. అనంతరం తన తండ్రి వారసత్వాన్ని అందుకొని సూర్య కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి నేడు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు.