మేకప్ తీయనని చెప్పడంతో ఎన్టీఆర్ సినిమానే వదులుకున్న కెమెరామెన్..ఎవరంటే?

ఒక సినిమా వెండితెరపై సందడి చేస్తుంది అంటే ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆహ్లాదకరంగా ఉండేలా చేయాలి.అలా సినిమాని ప్రేక్షకులకు అందంగా చూపించే బాధ్యత కెమెరామెన్ కు ఉంటుంది. ఇలా తెరపై నటీనటుల అందాలను ప్రకృతి అందాలను కను సొంపుగా చూపించడానికి కెమెరామెన్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం హై టెక్నాలజీ కెమెరాలు రావడం అలాగే గ్రాఫిక్స్ లో సెట్టింగ్ చేయడం వల్ల ఈ పని చాలా సులభతరం అవుతుంది. కానీ గతంలో హీరో హీరోయిన్ లకు సహజసిద్ధంగా అందంగా చూపించాలంటే కష్టతరమైన పని అని చెప్పాలి.

ఈ సమయంలో కూడా హీరో హీరోయిన్లను ఎంతో అందంగా చూపించడంలో కెమెరామెన్ ఇషాన్‌ ఆర్య ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన ఎన్నో అద్భుతన సినిమాలకు కెమెరామెన్ గా వ్యవహరించారు ఈ క్రమంలోని బాపురమణల దర్శకత్వంలో వచ్చిన స్నేహం, ముత్యాలముగ్గు, వంటి చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు.ఈ క్రమంలోని ఈయన ఛాయాగ్రహణంలో నందమూరి తారకరామారావు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఈ సినిమాషూటింగ్ పనులు ప్రారంభమైన తర్వాత ఎన్టీఆర్ ఎప్పటిలాగే తన విగ్గు, మేకప్ తో షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. అయితే ఆయన మేకప్ ఇషాన్ ఆర్య కు నచ్చలేదు. దీంతో ఆ సినిమాకు ఎన్టీఆర్ వేసుకున్న మేకప్ సెట్ అవ్వదని, ఆ లిప్స్టిక్, మేకప్ కూడా తొలగించాలని ఇషాన్ ఆర్య వెల్లడించారు. ఇలా ఈయన చెప్పడంతో నిర్మాతలు ఎన్టీఆర్ మేకప్ తొలగించడం కుదరదు, ఆయన తన మేకప్ తీసేయరు అని చెప్పడంతో వెంటనే ఇషాన్ ఆర్య తాను కూడా ఈ సినిమా చేయడం కుదరదు అని ఎన్టీఆర్ సినిమా నుంచి బయటికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా అన్నగారి మేకప్ ఆయన స్టైలే వేరని చెప్పాలి.