లవర్ బాయ్ తరుణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Tarun: టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయం అయ్యి అనంతరం నువ్వే కావాలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న నటుడు తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వేకావాలి సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న తరుణ్ ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తరుణ్ లవర్ బాయ్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఇండస్ట్రీలో ఈయన అగ్రహీరోగా కొనసాగుతారని ఆశించిన తరుణంలో కథల ఎంపిక విషయంలో ఈయన వేసిన తప్పటడుగులు ఈయన కెరీర్ ను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇలా తరుణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి అయినా ఏమాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ వరుస ఫ్లాప్ చిత్రాలు ఎదురుకావడంతో మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి దూరమవుతూ వచ్చారు.

తరుణ్ చివరిసారిగా నటించిన చిత్రం ఇది నా లవ్ స్టోరీ. ఈ సినిమా కూడా విడుదలై దాదాపు 4, 5 సంవత్సరాలు కావస్తోంది. ఈ సినిమా కూడా తరుణ్ కి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఏ విధమైనటువంటి సినిమాలను ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు తరుణ్ సినీ ఇండస్ట్రీకి కామా పెట్టారా లేక పులిస్టాప్ పెట్టారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన తరుణ్ ఎలాంటి సినీ ప్రయత్నాలు చేయకుండా తన వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి సినిమాల ద్వారా అయినా తరుణ్ ప్రేక్షకుల ముందుకు వస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.