సుడిగాలి సుధీర్ అసలు పేరు, ఆయన ఊరు ఎక్కడో తెలుసా?

do you know sudigali sudheer real name and village

సుడిగాలి సుధీర్.. ఇది పేరు కాదు.. ప్రస్తుతం ఇదొక బ్రాండ్. బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ కు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. సుధీర్.. ఏ షోలో ఉంటే ఆ షో హిట్టే. నో డౌట్. బుల్లి తెర మీద టాప్ హీరో అంటే సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి.

do you know sudigali sudheer real name and village
do you know sudigali sudheer real name and village

అయితే.. సుడిగాలి సుధీర్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అసలు సుడిగాలి సుధీర్ ఎలా జబర్దస్త్ లోకి వచ్చాడు? ఆయనది ఏ ఊరు. ఆయన అసలు పేరు ఏంటి? ఇలా ఎన్నో విషయాలు చాలామందికి తెలియదు.

స్క్రీన్ పేరు సుడిగాలి సుధీర్ అని అందరికీ తెలుసు కానీ.. నిజానికి సుడిగాలి సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్. అవును… ఆయన్ను తన ఇంట్లో సిద్ధూ అని పిలుస్తుంటారు. సిద్ధార్థ అని కూడా అంటుంటారు. అందుకే కేవలం స్క్రీన్ మీదనే సుడిగాలి సుధీర్ గా ఉండే సుధీర్ ఆనంద్.. ఎక్కువగా సిద్ధూగా ఉండటం కోసమే ఇష్టపడతాడట.

ఇక.. సుడిగాలి సుధీర్ ది ఏ ఊరో తెలుసా? ఆయనది విజయవాడ. తనకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. అక్కకు పెళ్లయింది. కెనడాలో ఉంటుంది. తమ్ముడికి కూడా పెళ్లయింది. వాళ్లంతా ఒకే ఫ్యామిలీ. ఒకే ఇంట్లో ఉంటారు.