ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆంధ్ర అందగాడుగా అందరినీ సందడి చేసిన శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించే శోభన్ బాబు హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇకపోతే శోభన్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ మంచి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు.ఈ విధంగా హీరోగా సినిమాలలో నటిస్తూనే వ్యాపారాలు చేస్తూ శోభన్ బాబు పెద్దఎత్తున ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఆయన సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించిన ధనవంతుడుగా శోభన్ బాబు పేరుతెచ్చుకున్నారు. ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ విలువైన భూములను కొనుగోలు చేయడమే కాకుండా షేర్స్ ద్వారా శోభన్ బాబు బాగా డబ్బు సంపాదించారని తెలుస్తోంది. ఈయన చనిపోయేనాటికి 50 వేల కోట్లకు పైగా ఆస్తిపాస్తులను సంపాదించారట.
గతంలో శోభన్ బాబు మాట్లాడుతూ మనం ఎక్కడ డబ్బు పెట్టిన నష్టపోతామో లేదో తెలియదు కానీ ఒక భూమి పై పెట్టుబడి పెడితే ఎప్పటికీ నష్టపోమని శోభన్ బాబు అందరికీ తెలియ చేసేవారట. అందుకే ఆయన ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భూములను కొనుగోలు చేశారని ఇలా ఆ భూములకు ధరలు పలకడం వల్ల అంత పెద్ద మొత్తంలో వేల కోట్ల ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.