Anchor Suma: వామ్మో… సుమ జయమ్మ పంచాయతీ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Suma: సుమ కనకాల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం సినిమా ఈవెంట్లు కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక్కో సినిమా ఈవెంట్ కు కేవలం గంట రెండు గంటలకే సుమారు రెండు లక్షల చొప్పున ఛార్జ్ చేస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న యాంకర్ గా కొనసాగుతున్న సుమ తాజాగా వెండితెర పై ఫోకస్ చేశారు.

ఇలా వెండితెరపై ఇప్పటికే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను సందడి చేసిన సుమా ఈసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా తానే ప్రధాన పాత్రలో నటిస్తూ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇక ఈ సినిమా కోసం సుమ చాలా తక్కువ డేట్స్ ఇచ్చారని సమాచారం. ఇలా సినిమాకి తక్కువ డేట్స్ ఇవ్వవడమే కాకుండా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్.

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సుమ జయమ్మ పంచాయతీ సినిమా కోసం ఏకంగా 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం వినబడుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటే సుమ బుల్లితెరపై బిజీ అయినట్టు వెండితెరపై కూడా బిజీ అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి విజయమ్మ పంచాయతీ ద్వారా సుమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.