కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విధంగా వరుస సినిమా అవకాశాలను అందుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇలా ఒక్కో సినిమాకు దాదాపు మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆస్తులు కూడా బాగా సంపాదించారని తెలుస్తుంది.
పలు నివేదికల సమాచారం ప్రకారం రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 50 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు, బంగ్లాలను కూడా ఈమె కొనుగోలు చేశారు. ఇలా రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీగా సంపాదించింది.ఇకపోతే పుష్ప సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్న రష్మిక తన తదుపరి సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు, విజయ్ దళపతి సినిమా అలాగే పుష్ప 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.